`#SSMB 28`.. టైటిల్ ఆ రోజే
on May 3, 2021
తన తాజా చిత్రం `సర్కారు వారి పాట` సెట్స్ పై ఉండగనే.. కొత్త సినిమా కబురు వినిపించేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. తనతో `అతడు`, `ఖలేజా` వంటి కల్ట్ క్లాసిక్స్ ని రూపొందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని చేయబోతున్నారు మహేశ్. మే డేన ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.
ఇదిలా ఉంటే.. `#SSMB 28` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే ఓ టైటిల్ ని ఫిక్స్ చేశారట త్రివిక్రమ్. అంతేకాదు.. మహేశ్ తో చేసిన గత రెండు సినిమాల తరహాలోనే ఇది కూడా మూడక్షరాల టైటిల్ గానే ఉంటుందట. అదే విధంగా.. పూజా కార్యక్రమాలు జరిగే రోజునే అంటే మే 31న టైటిల్ ని కూడా అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్.
`#SSMB 28`ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుండగా.. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించనున్నారు. 2022 వేసవిలో మహేశ్ - త్రివిక్రమ్ థర్డ్ జాయింట్ వెంచర్ థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read