Home

»

Latest News

డిసి భామ 'వామికా' ఏజ్ సీక్రెట్ రివీల్: అంతా ప్రాస్తెటిక్ మేకప్‌ అంట!

Oct 28, 2026 11:22AM


 

డిసి భామ హోదాలో అభిమానులు, ప్రేక్షకులు తన గురించి నిత్యం ఆలోచించేలా చేసిన  భామ వామికా గబ్బి. నిజానికి చాలా ఏళ్ళ క్రితమే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ చాలా ఏళ్ళకి 'డిసి' తో పాపులారిటీని తన కాంపౌండ్ వాల్ లో కట్టిపడేసింది.  తన లేటెస్ట్ ప్రాజెక్ట్  ‘ప్రహార్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉజ్వల్ నికమ్’ .


 రీసెంట్ గా ప్రహార్ గురించి ఒక ఇంటర్వ్యూ లో వామికా మాట్లాడుతు 'నిజ జీవితంలో నాకు ముప్పై సంవత్సరాలు.కానీ ప్రహార్ లో 50 ఏళ్ల వయసు గల జ్యోతి నికమ్ పాత్రను పోషించడానికి ప్రత్యేకమైన ప్రాస్తెటిక్ మేకప్‌ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ భారీ రూపాంతరం తన నటనకు సరికొత్త అనుభూతిని తెచ్చి పెట్టడంతో పాటు మేకప్ చైర్‌లో కూర్చున్న ప్రతీసారి తన రూపం క్రమంగా మారుతుండటం చూసి క్యారక్టర్ లో  పూర్తిగా లీనమైపోయాాను. షూటింగ్ సమయంలో ఈ మేకప్ ఎంతగా ప్రభావం చూపిందంటే, మేకప్ పూర్తయిన తర్వాత మొదటిసారి అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేనే నమ్మలేకపోయాని, అలా చూస్తూనే ఉండిపోయాను.  అది కచ్చితంగా నేనేనని తెలిసినప్పటికీ, అద్దంలో కనిపిస్తున్న వ్యక్తిని మాత్రం వెంటనే గుర్తించలేకపోయాను. కొన్నిసార్లు సెట్స్‌పై ఎవరో తమ ఫోన్‌లో తీసిన ఫొటోలను చూపించే వరకు తాను ఎంతగా మారిపోయాననే విషయాన్నే పూర్తిగా మర్చిపోయేదానినని వామిక చెప్పుకొచ్చింది.


 ఇది కూడా చదవండి: ఆ పదమూడు సాంగ్స్ సూర్యని రక్షిస్తాయా!

 


 

దినేష్ విజన్ మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై, అవినాష్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు ఉజ్వల్ నికమ్ పాత్రలో నటిస్తుండగా, జైదీప్ అహ్లావత్, సికందర్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ జీవితాధారంగా తెరకెక్కుతున్న ఈ లీగల్ డ్రామా చిత్రంలో వామిక గబ్బి ఉజ్వల్ నికమ్ భార్య జ్యోతి నికమ్ గా  కనిపించనున్నారు. 1993 ముంబై పేలుళ్లు, 2008 ముంబై ఉగ్రరూప దాడుల వంటి చారిత్రాత్మక కేసుల నేపథ్యంలో కథ సాగనుంది.

 

[wamiqa Gabbi Prahaar Prosthetic Makeup, Wamiqa Gabbi About Prahaar movie, Ujjwal Nikam story, prosthetic makeup, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com