
స్టార్ హీరో సూర్య కరుప్పు(వీరభద్రుడు), విశ్వనాధ్ అండ్ సన్స్ లాంటి వరుస విజయాలతో జోరు మీదున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు 'సీన్' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీలో పదమూడు పాటలు ఉండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
సాధారణంగా లవ్, ఫ్యామిలీ జోనర్, సంగీత ప్రధానంగా తెరకెక్కే జోనర్స్ లో ఎక్కువ సాంగ్స్ ఉండటం సహజం. ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ 'సీన్' మూవీ పక్కా క్రైం థ్రిల్లర్. మరి క్రైం థ్రిల్లర్ అంటే సీన్స్ తాలూకు ఎట్మాస్పియర్ ఎలా ఉంటుందో తెలిసిందే. రెండు కంటే ఎక్కువ సాంగ్స్ వస్తేనే అబ్బా అని ప్రేక్షకుడు అనుకునే పరిస్థితి అలా అని ఎక్కువ సాంగ్స్ ఉంటే నచ్చవని కాదు. ఏది ఏమైనా క్రైం థ్రిల్లర్ జోనర్ లో పదమూడు సాంగ్స్ అంటే మేకర్స్ దైర్యం చేస్తున్నట్టే.

మలయాళ హిట్ మేకర్ జీతూ మాధవన్ దర్శకుడు కాగా, సూర్య సరసన నజియా జోడి. నస్లెన్ నెగిటివ్ రోల్. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా సుశిన్ శ్యామ్ మ్యూజిక్.
[Thirteen Songs In scene, suriya About Scene, scene movie details, scene movie cast, nasriya, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]






