
మాటల్ని పొదుపుగా వాడి, ఆ మాటలని అభిమానులు, ప్రేక్షకులు తమ భవిష్య నిధిగా లాకర్ లో దాచుకునేలా చేసిన రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దర్శకత్వ శైలి సైతం ఎంత పెద్ద వైలెన్స్ కంటెంట్ అయినా ప్రవహించే జీవనదిలా సాగుతుంది. ఇక ఫ్యామిలీ జోనర్ గురించి చెప్పక్కర్లేదు. థియేటర్ నుంచి బయటకి వచ్చాక కూడా మనల్ని సదరు చిత్రం వెంటాడుతూనే ఉంటుంది. ఈ నెల 30 న విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి తో కలిసి 'ఆదర్శ కుటుంబం' తో వస్తున్నాడు.
నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. త్రివిక్రమ్ అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లకి నమస్కరించడం నెట్టింట సెన్సేషన్‌గా మారింది. దీంతో నెట్టిల్లు పలు చర్చలతో కళకళ లాడుతూ ఉంది. అసలు ఆ వేడుకలో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. స్టేజ్ మీదకి వచ్చిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఎంతో గౌరవంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు నమస్కరించేందుకు వంగారు. అదే సమయంలో త్రివిక్రమ్ కూడా అనూహ్యంగా స్పందిస్తూ శ్రీనిధి శెట్టి కాళ్లకు నమస్కరించేందుకు కిందకి వంగారు. ఇద్దరూ ఒకేసారి రియాక్ట్ కావడంతో అక్కడ కొద్దిసేపు సరదాగా అందరినీ ఆశ్చర్యపరిచే వాతావరణం నెలకొంది. త్రివిక్రమ్ సడన్‌గా అలా చేసేసరికి శ్రీనిధి శెట్టి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని ఆయనను వారిస్తూ తానూ కిందకు వంగి ఆయన పాదాలకు నమస్కరించుకున్నారు. ఈ అనూహ్య పరిణామాన్ని చూసి అక్కడే ఉన్న సీనియర్ యాంకర్ సుమా కనకాల "ఏంటిది.. అక్కడ ఏం జరుగుతోంది?" అంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో ఆడిటోరియంలోని ప్రేక్షకులు, అభిమానులు కేకలు, ఈలలతో హోరెత్తించారు.
ఇది కూడా చదవండి: డిసి భామ వామికా ఏజ్ సీక్రెట్ రివీల్: అంతా ప్రాస్తెటిక్ మేకప్ అంట!

ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు దణ్ణం పెట్టుకుంటూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. ఒక స్టార్ డైరెక్టర్ అయి ఉండి, తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్ను అంత సరదాగా, వినయపూర్వకంగా రిసీవ్ చేసుకున్న త్రివిక్రమ్ సింప్లిసిటీని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీనిధి శెట్టి నటనకు మెచ్చి ఆయన ఆ రేంజ్లో అప్రిషియేట్ చేశారా లేక కేవలం సరదాగా ఆ ఫన్ క్రియేట్ చేశారా అనే చర్చలు కూడా తారాస్థాయిలో జరుగుతున్నాయి.
[Trivikram Touches Srinidhi Shetty Feet, Trivikram Srinivas, Srinidhi Shetty, Aadarsha Kutumbam, Venkatesh Daggubati, Tollywood news, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]





