ఆ సంగీత దర్శకుడి తల్లికీ కరోనా!
on Jun 2, 2020

సాజిద్-వాజిద్ కుటుంబానికి మరో షాక్. వాజిద్ మృతి నుండి కోలుకోకముందే, అతడి అంత్యక్రియలు పూర్తయిన అతి కొద్ది సమయానికే కుటుంబమంతా ఆసుపత్రికి పరుగులు తీసింది. అతడు మరణించిన కొన్ని గంటల్లో వాజిద్ ఖాన్ తల్లి రెజీనా కరోనా పాజిటివ్ అని తేలింది. ముంబై మహానగరంలోని సురానా సేథియా ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. వాజిద్ ఖాన్ కూడా అదే ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు రెజీనా ఖాన్ త్వరగా కోలుకోవాలని సాజిద్-వాజిద్ కుటుంబం సహా వాళ్లను అభిమానించే శ్రోతలు, సన్నిహితులు, హిందీ చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు దేవుని ప్రార్థిస్తున్నాను.
వాజిద్ ఖాన్ మృతిపై హిందీ చిత్ర పరిశ్రమలో తొలుత భిన్న కథనాలు వినిపించాయి. అతడికి హార్ట్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడంతో ఆ కారణంగా మరణించి ఉంటాడని పలువురు ఊహించారు. అయితే అతడి సోదరుడు సాజిద్ ఖాన్.. కరోనా వైరస్ కారణంగా వాజిద్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సోమవారం ముంబై లోని ముస్లిం స్మశానవాటికలో వాజిద్ అంత్యక్రియలు నిర్వహించారు. అతి కొద్దిమంది స్నేహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో అంతిమ కార్యక్రమాలు జరిగాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



