ప్రభాస్ సినిమాలో మలయాళీ నటుడు
on Jun 2, 2020

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన సంక్రాంతి హిట్ 'అల... వైకుంఠపురములో' సినిమాలో టబు భర్తగా నటించిన జయరామ్ గుర్తున్నాడా? మలయాళంలో ఆయన స్టార్ యాక్టర్. ఇంతకు ముందు కమల్ హాసన్ 'పంచతంత్రం'తో తెలుగు ప్రేక్షకులు కొందరికి అతడు గుర్తే. అనుష్క 'భాగమతి'లోనూ నటించారు. ఇప్పుడీయనకు తెలుగులో మరో భారీ సినిమాలో నటించే అవకాశం దక్కింది.
ప్రభాస్ కథానాయకుడిగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రకు జయరామ్ ను ఎంపిక చేశారు. ఆ పాత్ర ఏమిటన్నది కొన్ని రోజులు సస్పెన్సు. ఇందులో పూజా హెగ్డే తండ్రి పాత్రలో మురళీశర్మ నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఆల్రెడీ లుక్ ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



