అలిమేలుమంగ ఎవరు?
on Jun 2, 2020

మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. కొంత కాలంగా అతను చేస్తున్న సినిమాలేవీ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తీసుకు రావట్లేదు. అయినప్పటికీ అతని చేతిలో ఆసక్తికర చిత్రాలున్నాయి. 'గౌతమ్ నందా' మూవీ తర్వాత మరోసారి అతను సంపత్ నంది డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందనున్నది. ఇందులో ఫుల్‌బాల్ కోచ్‌గా గోపి కనిపించనున్నాడు.
దీని తర్వాత తన కెరీర్‌కు విలన్‌గా 'జయం' మూవీతో పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ డైరెక్షన్‌లో 'అలిమేలుమంగ వేంకటరమణ' మూవీని చేసేందుకు అతను సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఇందులో వేంకటరమణ క్యారెక్టర్‌ను గోపీ చేయనుండగా, అలిమేలుమంగ పాత్రను ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫిల్మ్‌నగర్‌లో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరు గోపీతో ఇదివరకు సరైన జోడీ అనిపించుకున్న అనుష్క కాగా, మరొకరు ఇప్పటికీ టాప్ స్టార్స్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్న కాజల్ అగర్వాల్.
నిజానికి తేజ మొదట కాజల్‌నే తీసుకుందామని భావించినట్లు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఇంతవరకూ గోపీ, కాజల్ కలిసి నటించలేదు. అయితే ఇటీవల వరుసగా 'నేనే రాజు నేనే మంత్రి', 'సీత' సినిమాల్లో నాయికగా కాజల్‌నే తీసుకున్న తేజ.. ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు వినిపిస్తోంది. 'లక్ష్యం', 'శౌర్యం' వంటి సినిమాలతో గోపీ, అనుష్క హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. 'శౌర్యం' తర్వాత ఆ ఇద్దరూ మళ్లీ కలిసి నటించలేదు. ఇప్పడు ఆ జోడీ ఖాయమైతే పన్నెండేళ్ల విరామంతో మళ్లీ కలిసి నటిస్తున్నట్లు అవుతుంది. తేజ చివరకు ఎవరిని తీసుకుంటాడో చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



