డేటింగ్‌కి ఏజ్ గ్యాప్‌తో పని లేదట
on Mar 7, 2020
తెలుగులో రాహుల్ దేవ్ ఈమధ్య పెద్దగా కనిపించడం లేదు గానీ, ఒకప్పుడు పెద్ద హీరోలతో పెద్ద సినిమాల్లో నటించాడు. సాయి ధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్'లో చివరగా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన ఈ విలన్, అంతకు ముందు రామ్ చరణ్ 'నాయక్', 'ఎవడు' చిత్రాలతో పాటు ప్రభాస్ 'పౌర్ణమి','మున్నా', ఎన్టీఆర్ 'సింహాద్రి' తదితర సినిమాల్లో నటించాడు. అసలు విషయానికి వస్తే... ప్రస్తుతం రాహుల్ దేవ్ ఏజ్ 44 ఇయర్స్. తనకంటే వయసులో 14 ఏళ్ళు చిన్నదైన మోడల్ కమ్ హీరోయిన్ ముగ్ధా గాడ్సేతో డేటింగ్‌లో ఉన్నాడు.
ముగ్ధాతో డేటింగ్‌కి ముందు రాహుల్ కి పెళ్లయింది. ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. మొదటి భార్య క్యాన్సర్ కారణంగా మరణించింది. ఆ తర్వాత ఒక పెళ్లిలో కలిసి ముగ్ధాతో కొన్నాళ్లు కలిసి ట్రావెల్ చేసిన తర్వాత డేటింగ్ స్టార్ట్ చేశాడు. అయితే... ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. రీసెంట్ గా తనకు, ముగ్ధ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి రాహుల్ దేవ్ మాట్లాడాడు. "నా పేరెంట్స్ మధ్య 10 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. సో, మా మధ్య గ్యాప్ పెద్దది అనుకోవడం లేదు. కపుల్ హ్యాపీగా ఉన్నప్పుడు ఏజ్ గ్యాప్ పెద్ద సమస్య కాదు. దాంతో పని లేదు" అని రాహుల్ దేవ్ అన్నాడు.