వన్స్ మోర్.. వైష్ణవ్, కృతి పెయిర్
on Apr 17, 2021
బ్లాక్ బస్టర్ మూవీ `ఉప్పెన`లో ఆశీ, బేబమ్మగా జీవించేశారు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి. డెబ్యూ ఫిల్మ్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసి.. క్యూట్ అండ్ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. అలాంటి ఈ ఇద్దరు.. త్వరలోనే మరోసారి జట్టుకట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఉప్పెన` చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వైష్ణవ్ తేజ్ తో మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తోందట. అంతేకాదు.. ఇందులో కృతిని నాయికగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. `ఉప్పెన`తో ఈ జంటకి వచ్చిన క్రేజ్ దృష్ట్యా.. ఈ పెయిర్ ని మరోసారి రిపీట్ చేయాలని మైత్రీ భావిస్తోందట. త్వరలోనే వైష్ణవ్, కృతి సెకండ్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ వస్తుంది.
కాగా, వైష్ణవ్ సెకండ్ ఫిల్మ్ (క్రిష్ డైరెక్టోరియల్) విడుదలకు సిద్ధమవగా.. ఇటీవలే గిరీశయ్య దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కింది. ఇక కృతి విషయానికి వస్తే.. నానికి జంటగా `శ్యామ్ సింగ రాయ్`, సుధీర్ బాబుకి జోడీగా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`తో రామ్ సరసన ఓ బైలింగ్వల్ మూవీ చేస్తోంది. అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ తోనూ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
Also Read