ఫస్ట్ మహేశ్.. నెక్స్ట్ పవన్..
on Apr 17, 2021
`నువ్వే నువ్వే`తో దర్శకుడిగా తొలి అడుగేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పటికే స్టార్ రైటర్ గా రాణిస్తున్న త్రివిక్రమ్ కి.. డైరెక్టర్ గా మొదటి ప్రయత్నంలోనే మంచి విజయం దక్కింది. ఆపై సూపర్ స్టార్ మహేశ్ బాబుతో `అతడు`, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో `జల్సా` చేసి హ్యాట్రిక్ అంకాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. అనంతరం కెప్టెన్ గా మరిన్ని సక్సెస్ ఫుల్ వెంచర్స్ తో సందడి చేశాడు. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంతరం మళ్ళీ మహేశ్, పవన్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట త్రివిక్రమ్.
`
ఆ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో`తో సంచలన విజయం అందుకున్న త్రివిక్రమ్.. ఆ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ వెంచర్ ని ప్లాన్ చేశాడు. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడింది. దీంతో.. మహేశ్ తో తన తదుపరి చిత్రాన్ని సెట్ చేసుకున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. అంతేకాదు.. మహేశ్ తరువాత పవన్ తో సినిమా చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట త్రివిక్రమ్. మహేశ్ కాంబో మూవీ పూర్తయ్యాకే అంటే 2022 వేసవిలో పవన్ తో త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుందని బజ్. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ `అతడు`, `ఖలేజా` చిత్రాలు చేయగా.. పవన్ `జల్సా`, `అత్తారింటికి దారేది`, `అజ్ఞాతవాసి` చేసిన సంగతి తెలిసిందే.