అవార్డు వస్తే చెత్తబుట్టలో పడేస్తా.. ఇంత అసూయనా!
on Sep 3, 2023
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడు అవార్డు సహా పలు అవార్డులు టాలీవుడ్ ఖాతాలో పడ్డాయి. అయితే ఈ అవార్డుల్లో కోలీవుడ్ కి నిరాశే ఎదురైంది. దీంతో తమిళ తంబీలు సోషల్ మీడియా వేదికగా తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తాజాగా తమిళ హీరో విశాల్ సైతం సంచలన కామెంట్స్ చేశాడు.
తన లేటెస్ట్ మూవీ 'మార్క్ ఆంటోనీ' ప్రమోషన్స్ లో పాల్గొన్న విశాల్.. అవార్డుల గురించి మాట్లాడుతూ దారుణ వ్యాఖ్యలు చేశాడు. "నాకు అవార్డులపై నమ్మకం లేదు. ప్రేక్షకులు ఇచ్చేదే నిజమైన అవార్డు. ఒకవేళ నా చిత్రాలకు అవార్డులు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేస్తా." అని విశాల్ అన్నాడు.
ఎంత కోలీవుడ్ కి అవార్డులు రానప్పటికీ.. అవార్డుల గురించి విశాల్ అంత దారుణ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి విశాల్ ది తెలుగు కుటుంబమే. కాకపోతే చెన్నైలో సెటిల్ అయ్యారు. తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా అతనికి మంచి గుర్తింపు ఉంది. విశాల్ సహా పలువురు తమిళ హీరోల డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాంటిది తెలుగువారికి అవార్డులు వస్తే దానిని ఆరోగ్యకరమైన పోటీగా భావించి విష్ చేయాల్సింది పోయి, ఇలా అసూయపడటం ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
