ఆ పాత్రకు న్యాయం చేయగల హీరో ఎన్టీఆర్ ఒక్కడే.. బాలీవుడ్ డైరెక్టర్ ప్రశంసలు!
on Sep 3, 2023

జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ఆర్ఆర్ఆర్'తో తన ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు సైతం ఎన్టీఆర్ నటనను ఫిదా అయ్యారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అనిల్ శర్మ కూడా ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు.
సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో అనిల్ శర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గదర్-2'. 2001 లో వీరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'గదర్'కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.650 కోట్ల గ్రాస్ రాబట్టి బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆనందాన్ని పంచుకున్న అనిల్ శర్మ.. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ జనరేషన్ హీరోలతో 'గదర్' చేయాల్సి వస్తే సన్నీ డియోల్ పోషించిన తారాసింగ్ పాత్రకు ఎవరు సరిపోతారని యాంకర్ అడగగా.. " ఆ పాత్రకి న్యాయం చేసే హీరోలు బాలీవుడ్ లో లేరు. సౌత్ లో ఉన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకి పూర్తి న్యాయం చేయగలడు" అని అనిల్ శర్మ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పటికే ఎన్టీఆర్ పై బాలీవుడ్ దృష్టి పడింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న బిగ్గెస్ట్ ఫిల్మ్ 'వార్-2'లో ఎన్టీఆర్ నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ అనిల్ శర్మ వ్యాఖ్యలు బట్టి చూస్తే భవిష్యత్ లో మరిన్ని బాలీవుడ్ అవకాశాలు ఎన్టీఆర్ ను వెతుక్కుంటూ వచ్చేలా ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



