మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం.. అనుకున్నదే జరుగుతుందిలే
on Jan 22, 2026

-సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విశాల్
-మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం
-ఫ్యాన్స్, ప్రేక్షకులు ఏమంటున్నారు
సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ కాబోయే కొన్ని కాంబినేషన్స్ షూట్ దశ నుంచే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంటాయి. అటువంటి ఆసక్తినే కలిగిస్తున్న కాంబో విశాల్(vishal),తమన్నా(Tamannaah). ఈ ఇద్దరు ప్రస్తుతం హిట్ మేకర్ సుందర్(Sundar)దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీకి రీసెంట్ గా 'మొగుడు' అనే టైటిల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు ఐదు నిమిషాల నిడివితో ఉన్న ప్రోమో ని రిలీజ్ చేశారు. సదరు ప్రోమో చూస్తుంటే సినిమా ఏ ఉద్దేశ్యంతో తెరకెక్కుతుందో చాలా క్లియర్ గా చెప్పడమే కాకుండా ప్రోమోలోని అంశాలు అభిమానులతో పాటు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మరి అంతలా ఆకట్టుకునే విధంగా ప్రోమోలో ఏముందో చూద్దాం.
తమన్నా టీవీలో కామెడీ కింగ్ యోగిబాబు నటించిన సీరియల్ ని చూస్తుంది. విశాల్ ఇంటి ఫ్లోర్ ని తుడుస్తూ ఉన్నాడు. యోగిబాబు తన అత్తయ్యతో మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత యోగిబాబు రియల్ గానే తమన్నా ఇంటికి వచ్చాడు. దీంతో విశాల్ తో తమన్నా టీ తీసుకు రమ్మంటుంది. కిచెన్ లోకి వెళ్తున్న విశాల్ కి తన ఇంట్లోకి రౌడీలు వచ్చారని తెలుస్తుంది. ఆ తర్వాత కిచెన్ లో విశాల్, రౌడీల మధ్య ఫైట్ జరుగుతుంది. ఇదంతా చూసి యోగిబాబు షాక్ అవుతాడు. యోగిబాబు ముఖంపై రౌడీల బ్లడ్ పడినా తమన్నా చూసి టమాటా రసం పడిందా అని అంటుంది. ఐదు నిమిషాల ఈ టైటిల్ ప్రోమోతో మూవీలో మాస్ అండ్ కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో మేకర్స్ చెప్పినట్లయింది.
Also read: బయటపడిన ప్రముఖ హీరోయిన్ చాటింగ్..టీనేజ్ యువకుల ధైర్యానికి మెచ్చుకోవాలి
విశాల్, సుందర్ కాంబోలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. వాటిల్లో గత ఏడాది సంక్రాంతి కి వచ్చిన 'మదగజరాజా’ ఒకటి. దీంతో 'మొగుడు' పై అంచనాలు పెరిగాయి. కొంత గ్యాప్ తర్వాత తమన్నా ఫ్యామిలీ లుక్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదనపు ఆకర్షణ. హిప్‌హాప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బెంజ్ మీడియా, ఖుష్భు కలిసి నిర్మిస్తున్నారు. మొగుడు టైటిల్ తో గోపీచంద్, కృష్ణవంశీ కాంబోలో మూవీ వచ్చి పరాజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



