నారా లోకేష్ కి ఎన్టీఆర్ బర్త్ డే విషెస్.. మరో నాలుగు నెలల్లో...
on Jan 23, 2026

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), నారా లోకేష్ (Nara Lokesh) వరుసకు బావాబావమరుదులు అవుతారనే విషయం తెలిసిందే. సినిమాలతో ఎన్టీఆర్, రాజకీయాలతో లోకేష్ బిజీగా ఉండటంతో ఇద్దరూ కలిసే సందర్భాలు చాలా తక్కువే. అయితే ఒకరి పుట్టినరోజుకి మరొకరు ఖచ్చితంగా విష్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే నేడు(జనవరి 23) లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ విష్ చేశాడు. (Nara Lokesh Birthday)
లోకేష్, ఎన్టీఆర్ ఇద్దరిదీ ఇంచుమించు ఒకే వయసు. 1983 జనవరి 23న లోకేష్ జన్మించగా, 1983 మే 20న ఎన్టీఆర్ జన్మించాడు. నెలలు తేడాతోనే పుట్టినరోజులు ఉండటంతో.. కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా వీరిరువురూ శుభాకాంక్షలు తెలుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
"జన్మదిన శుభాకాంక్షలు లోకేష్. ఇది మీ జీవితంలో మరో అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను" అంటూ లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. దీంతో నందమూరి, నారా అభిమానులు ఆనందంతో ఆ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు.
మరో నాలుగు నెలల్లో అనగా మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉండటంతో.. ఆ రోజు లోకేష్ ట్వీట్ చేస్తాడు అనడంలో సందేహం లేదు. గతేడాది కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా లోకేష్ శుభాకాంక్షలు తెలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



