బయటపడిన ప్రముఖ హీరోయిన్ చాటింగ్..టీనేజ్ యువకుల ధైర్యానికి మెచ్చుకోవాలి
on Jan 22, 2026

-ఇంతకీ ఆ చాటింగ్ లో ఏముంది!
-అవంతిక మోహన్ ఎవరు
-ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది
పెళ్లి కానీ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎవరకి మాత్రం ఉండదు చెప్పండి. అందులోను వాళ్ళకి నచ్చిన అందమైన సినిమా హీరోయిన్ పెళ్ళికి రెడీగా ఉండి సోషల్ మీడియా వేదికగా ముచ్చట్లు పెడుతు ఉంటే పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తారు కదా. ఇప్పుడు అదే విధంగా అందమే అసూయ పడేంత అందంతో ఉండే ప్రముఖ హీరోయిన్ అవంతిక మోహన్(Avantika Mohan)కి ఇద్దరు యువకులు పెళ్లి ప్రపోజ్ తీసుకొస్తున్నారు. ప్రపోజ్ లు చేస్తుంది ఎవరు? వాళ్ల వయసు ఎంత! అవంతిక మోహన్ రిప్లై ఎలా ఉందో చూద్దాం.
ఇనిస్టా వేదికగా కేరళ(kerala)కి చెందిన టీనేజ్ యువకుడు అవంతిక మోహన్ తో' కేరళలో నిన్ను చాలా మంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. వాళ్లలో నేను ఒకడిని అంటు మెసేజ్ చేసాడు. ఆ మెసేజ్ పై అవంతిక స్పందిస్తు 'ఇంత చిన్న వయసులో నీకు ఎంత దైర్యం. బుడ్డోడా నీకు చెప్పేది ఒక్కటే, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. కొత్త హీరోకి ఛాన్స్ లేదు. వెళ్లి హోమ్ వర్క్ చేసుకో. కెరీర్ పై ఫోకస్ చేస్తుండని రిప్లై ఇచ్చింది. మరో టీనేజ్ యువకుడు 'నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా అని అడిగాడు. అవంతిక రిప్లై ఇస్తూ నీ మెసేజ్ చూస్తుంటే నాకు కోపం రాకుండా నవ్వొస్తుంది.నీకు దాదాపుగా ఇరవై ఏళ్ళ వరకు ఉండచ్చు. చాలా రాంగ్ టైం ఇది. అయినా కూడా నీ ధైర్యానికి మెచ్చుకొని తీరాల్సిందే అని అవంతిక రిప్లై ఇచ్చింది. సదరు యువకుల స్క్రీన్ షాట్స్ ని కూడా అనంతిక తన అకౌంట్ లో షేర్ చేసింది.
Also read: నమ్రత పై మహేష్ బాబు భావోద్వేగ ట్వీట్
2012 వ సంవత్సరంలో 'యక్షి' అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన అవంతిక మోహన్ తెలుగులో 'ఉందిలే మంచి కాలం ముందు ముందున' అనే మూవీతో అలరించింది. 2015 నుంచే మలయాళ టీవీ షోస్, సీరియల్స్ లో కూడా తన సత్తా చాటుతూ ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. గత ఏడాది ధీరమ్ అనే మలయాళ మూవీతో మెప్పించిన అనంతిక 2017 లో అనిల్ కుమార్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ ఇద్దరికి రుద్రాంష్ అనే కుమారుడు ఉన్నాడు. అవంతిక మోహన్ అసలు పేరు ప్రియాంక.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



