ఆగష్ట్ లో చైతు, సమంతల పెళ్లి..!
on Nov 15, 2016
ఇప్పటికే అక్కినేని అఖిల్ పెళ్లికి ఓ క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ నెలలో అఖిల్, శ్రేయాభూపాల్ ల నిశ్చితార్థం జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుండే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పెళ్లి కూడా విదేశాల్లో ప్లానింగ్ చేస్తున్నారు. అయితే వీరి పెళ్లితో పాటు నాగచైతన్య, సమంత పెళ్లి విషయంలో కూడా అక్కినేని ఫ్యామిలీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నిజానికి అఖిల్, చైతుల ఇద్దరి పెళ్లిళ్లు ఒకేసారి చేద్దామనకున్నారు కానీ అది కుదరలేదు. అయితే ఇప్పుడు చైతు, సమంతల పెళ్లి 2017 ఆగష్ట్ లో నిర్వహించాలని భావిస్తున్నారట. గతంలో అనుకున్నట్టుగా హిందూ సాంప్రదాయ ప్రకారం, క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం రెండు వివాహాలు జరిపించేందుకు నిర్ణయించారు. అయితే ఒక్క రోజు తేడాతో ముందు హిందూ వివాహం తరువాతి రోజు క్రిస్టియన్ వివాహం ప్లాన్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో... వీరి పెళ్లి విషయంలో అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే మరి.