పాటలు పాడనున్న విక్రం
on May 26, 2018
తమిళ, తెలుగు ప్రజలకు విక్రం గురించి పరిచయం అవసరం లేదు. అపరిచితుడు లాంటి వైవిధ్యమైన చిత్రాలతో జాతీయ అవార్డుని కైవసం చేసుకున్న నటుడు విక్రం. విక్రం మొదట్లో డబ్బింగ్ చెప్పేవాడన్న విషయం చాలామందికి తెలియదు. తమిళంలో అజిత్‌లాంటి నటులతో పాటు, తెలుగు నుంచి తమిళానికి డబ్బింగ్ అయిన చిత్రాలకి కూడా తన గొంతుని అరువిచ్చేవాడు. ఆ ధైర్యంతోనే ఇంతకుముందు కొన్ని పాటలు కూడా పాడాడు. తెలుగులో మల్లన్న సినిమాలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు, excuse me అనే పాట కూడా పాడాడు. ఇప్పుడు తాజాగా సామి2లో కూడా విక్రమ్ కొన్ని పాటలు పాడనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న దేవిశ్రీప్రసాద్ విక్రమ్‌తో కొన్ని పాటలు పాడించాలని పట్టుదలగా ఉన్నాడట.