నా సినిమా ఫ్లాప్ – అంగీకరించిన నాని
on May 26, 2018
తెలుగు హీరోలకి ఇగో ఎక్కువని ఓ ప్రచారం. ఆ హీరోలని అనుకరించే ఫ్యాన్స్ కూడా మా హీరో సినిమా గొప్పంటే మా సినిమా గొప్పని తెగ కొట్టేసుకుంటారు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. నిన్నటికి నిన్న సినిమా వసూళ్ల గురించి పోస్టర్ల మీద వేసి వివాదాలు సృష్టించవద్దని రామ్‌చరణ్ సూచించారు. మరో వార్తలో నాని తన కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ అని ట్విట్టర్ వేదికగా ఒప్పేసుకున్నారు. ఎవరో ఆ సినిమాని సూపర్ హిట్ అని పేర్కొనగా దానికి బదులిస్తూ నాని- `సూపర్‌హిట్ అంట.. అవలేదు బాబాయ్.. ఆడలేదు కూడా.. అయినా మనసు పెట్టి చేశాం.. చూసెయ్యండి` అంటూ స్పందించాడు. నిజమే కదా!