`థాంక్ యూ`.. ముచ్చటగా మూడోసారి!
on Nov 23, 2021

వైవిధ్యానికి పెద్దపీట వేసే దర్శకుల్లో విక్రమ్ కె. కుమార్ ఒకరు. రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే ఈ టాలెంటెడ్ కెప్టెన్.. 20 ఏళ్ళ తన సినీ ప్రియాణంలో కేవలం ఎనిమిది చిత్రాలకే పరిమితమయ్యారు. ప్రస్తుతం విక్రమ్.. యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో `థాంక్ యూ` చేస్తున్నారు. `మనం` వంటి మెమరబుల్ మూవీ తరువాత విక్రమ్, చైతూ కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా, చైతూ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇదిలా ఉంటే.. `థాంక్ యూ` చిత్రానికి లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. విక్రమ్ - శ్రీరామ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు రాగా, అవి రెండు కూడా మంచి విజయం సాధించాయి. ఆ చిత్రాలే.. `యావరుమ్ నలమ్` (తెలుగులో `13 - పదమూడు`), `ఇష్క్`. కట్ చేస్తే.. దాదాపు పదేళ్ళ తరువాత ముచ్చటగా మూడోసారి జట్టుకట్టిన ఈ సక్సెస్ ఫుల్ కాంబో.. `థాంక్ యూ`తో హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.
కాగా, `దిల్` రాజు నిర్మిస్తున్న `థాంక్ యూ`లో చైతూకి జోడీగా రాశీ ఖన్నా, అవికా గోర్ నటిస్తున్నారు. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు. త్వరలోనే ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా థియేటర్స్ లోకి రాబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



