చైతూ బర్త్ డే సర్ప్రైజ్ అదిరింది.. 'థాంక్యూ'తో మ్యాజిక్ చేసేలా ఉన్నాడు!
on Nov 23, 2021
.webp)
అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'థాంక్యూ'. 'మనం' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
నేడు(నవంబర్ 23) చైతన్య పుట్టినరోజు సందర్భంగా 'థాంక్యూ' మూవీ నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాయి. గ్లింప్స్ లో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లో రంగులరాట్నంపై కూర్చొని చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి చిన్న పిల్లాడిలా ఆనందంగా గడుపుతూ చైతన్య కనిపించాడు. గ్లింప్స్ వీడియో విజువల్ గా ఎంత బాగుందో.. దానికి తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతే బ్యూటిఫు గా ఉంది. రంగులరాట్నంపై కూర్చొని కేరింతలు కొడుతున్న చైతన్య ఫోటోని ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ కలర్ ఫుల్ గా ఆకట్టుకుంటున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి 'మనం' మెమొరబుల్ మూవీని ఇచ్చిన విక్రమ్ 'థాంక్యూ'తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అవికా గోర్, మాళవిక నైర్ కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



