మహేష్ తర్వాత ఆ రికార్డు విజయ్ దేవరకొండదే
on Mar 17, 2020
సూపర్‌స్టార్ మహేష్‌బాబు నాలుగేళ్ల క్రితం... ఇంగ్లిష్ డైలీ టైమ్స్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసే 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' సర్వేలో బ్యాక్ టు బ్యాక్ రెండు సంవత్సరాలు విజేతగా నిలిచాడు. మహేష్ తర్వాత ఆ రికార్డు యంగ్ సెన్సేషనల్ హీరో, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ విజయ్ దేవరకొండదే. 2018లో 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్'గా నిలిచిన విజయ్ దేవరకొండ, 2019లోనూ నిలిచాడు. అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే... మహేష్ ఈ టైటిల్ రెండుసార్లు గెలవడానికి ముందే సూపర్ స్టార్. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' విజయాల తర్వాత స్టార్ స్టేటస్ వస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్'గా నిలిచాడు. గత ఏడాది 'డియర్ కామ్రేడ్' బ్లాక్ బస్టర్ కాన్ఫప్పటికీ మరోసారి టైటిల్ నెగ్గాడు.
"వచ్చే ఏడాదీ నేనే ఈ టైటిల్ నెగ్గుతా" అని విజయ్ దేవరకొండ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. ఇన్నేళ్లలో తాను ఎప్పుడూ జిమ్‌కి వెళ్లి సీరియస్‌గా వర్కవుట్స్ చేసింది లేదనీ, ఇప్పుడో క్యారెక్టర్ కోసం వెళుతున్నాననీ, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నానని విజయ్ దేవరకొండ తెలిపాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
