థియేటర్లలో విడుదలైన రోజే యాప్‌లోనూ...
on Mar 18, 2020
జై ఆకాష్ గుర్తున్నాడా? 'ఆనందం', 'పిలిస్తే పలుకుతా' సినిమాల్లో నటించాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సినిమాలు చేశాడు. రాజశేఖర్ 'గోరింటాకు', వెంకటేష్ 'నమో వెంకటేశాయ' సినిమాల్లో కీ రోల్స్ చేశాడు. ఆ తర్వాత దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాడు. హీరోగా స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు. ఈ రోజు (మార్చి 18న) తన పుట్టినరోజు సందర్భంగా తన పేరు మీద 'ఎ క్యూబ్' అని కొత్తగా ఒక యాప్ స్టార్ట్ చేశాడు. 'ఎ' అంటే ఆకాష్ అన్నమాట. తన సినిమాలను థియేటర్లలో విడుదలైన రోజే ఈ యాప్‌లోనూ విడుదల చేస్తానని ఆకాష్ తెలిపాడు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డబ్బులు కట్టనవసరం లేదు. కానీ, సినిమా చూడాలంటే యాభై రూపాయలు కట్టాలి. రెండు రోజుల్లో ఎన్నిసార్లయినా సినిమా చూడొచ్చట. ఆకాష్ డ్యూయల్ రోల్ చేసిన 'అందాల రాక్షసుడు' సినిమాను యాప్‌లో రిలీజ్ చేస్తానని చెప్పాడు. ప్రతి వారం ఏదో ఒక సినిమా యాప్ లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తానని అంటున్నాడు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ కి అలవాటు పడిన ప్రేక్షకులు... ఆకాష్ సినిమాలు చూస్తారా? వెయిట్ అండ్ సి.
Also Read