విజయ్ దేవరకొండ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ అయింది!
on Jan 25, 2026
గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాహుల్ సంకత్యాన్తో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘రణబలి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.
స్వాతంత్య్రానికి ముందు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉంటుంది. వలసలు, కరవు జీవితం, జానపద కథలు, తిరుగుబాటు భావాలు వంటి ఎలిమెంట్స్‌తో ఈ కథను రూపొందించారు. ఇందులో విజయ్ దేవరకొండ ఒక వీరయోధుడిగా కనిపించబోతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారు.
ఇంతకుముందు విజయ్, రాహుల్ కాంబినేషన్‌లో వచ్చిన టాక్సీవాలా మంచి విజయాన్ని సాధించింది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఒక సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుండగా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది తప్పకుండా ఒక మంచి సినిమా అవుతుందని అందరూ భావిస్తున్నారు.
సోమవారం టైటిల్‌తోపాటు సినిమాలోని విజయ్ దేవరకొండ లుక్‌ను కూడా రివీల్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటివరకు విజయ్ చేసిన క్యారెక్టర్లకు భిన్నమైన క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నారని తెలుస్తోంది. ఇది అతనికి కంబ్యాక్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ కూడా ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



