‘ఉస్తాద్ భగత్ సింగ్’ పవర్ స్టార్మ్ మొదలైంది..!
on Jan 25, 2026
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందనే న్యూస్ వచ్చిన దగ్గర నుంచి మెగాభిమానులు ఎంతో ఈగర్‌గా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి పవర్‌స్టార్‌ను హరీష్ ఎలా చూపించబోతున్నాడు అనే విషయం ఇప్ప్పుడు ఆసక్తికరంగా మారింది.
హై ఓల్టేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను ప్రారంభించారు మేకర్స్. ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ‘ఇక అసలైన జాతర మొదలైంది.. ఉస్తాద్ అప్ డేట్స్ బ్లాస్ట్ త్వరలోనే జరగబోతోంది’ అని ప్రకటించింది చిత్ర యూనిట్. దీంతో సోషల్ మీడియాలో పవర్‌స్టార్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
పవర్ స్టార్ సరసన తొలిసారి శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో అద్భుతమైన పాటలు రాబోతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో లావిష్‌గా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ మేనరిజం, ‘ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు.. అంతకు మించి ఉంటుంది’ అనే డైలాగ్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. మొత్తానికి పవర్‌స్టార్ అభిమానులను ఖుష్ చేసేందుకు త్వరలోనే ఉస్తాద్ భగత్‌సింగ్ థియేటర్లలో సందడి చేయబోతున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



