జపాన్ అభిమాని చేసిన పనికి షాక్ అయిన అల్లు అర్జున్, రష్మిక!
on Jan 25, 2026
తెలుగు సినిమాలకు జపాన్‌లో ఎంతటి ఆదరణ ఉంటుందో అందరికీ తెలిసిందే. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కూడా జపాన్ అభిమానులను సంపాదించుకున్నారు. పుష్ప2 విడుదల సందర్భంగా అల్లు అర్జున్, రష్మిక ఇద్దరూ కలిసి జపాన్ వెళ్లారు. ఎంతో సందడిగా జరిగిన ఈ పర్యటనలో కజు అనే జపనీస్ అభిమాని మాటలకు బన్ని, రష్మిక షాక్ అయ్యారు. వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేస్తూ తెలుగులో మాట్లాడి ఆ అభిమాని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
బన్నీ అతనితో జపనీస్‌లో మాట్లాడాలని ట్రై చేస్తుండగా కజు మాత్రం ‘మీరు తెలుగు సినిమాలకే గర్వకారణం. మీ నటన అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు చాలా అందమైన భాష. నేను నేర్చుకుంటున్నాను, దయచేసి నా తెలుగును భరించండి’ అని చెప్పడంతో బన్నీ, రష్మిక షాక్ అయి చప్పట్లు కొడుతూ అతన్ని అప్రిషియేట్ చేశారు. అతని తెలుగు చూసి ‘నీ తెలుగు చాలా బాగుంది, నువ్వు ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి’ అని బన్నీ అనడంతో అక్కడి వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
బన్ని, రష్మికలతో జరిగిన ఈ చాటింగ్ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంటూ ‘భారతదేశ అగ్ర నటులను ఇంటర్వ్యూ చేసే గౌరవం దక్కినందుకు కృతజ్ఞుడను’ అని రాశాడు కజు. ఇప్ప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. తెలుగు భాష గొప్పతనం ప్రపంచవ్యాప్తం అవుతోందని అభిమానులు ఎంతో గర్వంగా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇప్ప్పుడు ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



