అక్కినేని అంటే ఒక నటనా విశ్వవిద్యాలయం : వెంకయ్యనాయుడు
on Sep 20, 2023
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించి అన్నపూర్ణ స్టూడియోలో ఆవిష్కరించాలని అక్కినేని ఫ్యామిలీ నిర్ణయించుకొని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారు మహానటుడు, మహా మనిషి, అన్నిరకాల వ్యక్తిత్వాలు కలిసి ఉన్న వ్యక్తి. నాగేశ్వరరావుగారు జీవితాంతం నటిస్తూనే ఉన్నారు. ఆఖరి రోజు వరకు నటించిన నటుడు నాకు తెలిసి ఎవరూ లేరు. సినిమా రంగంలో విలువలు పాటించిన మంచి మనిషి అక్కినేని. నాగేశ్వరరావుగారికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఏమిటంటే ఆయన చూపిన మార్గంలో మనం పయనించడం, భాష, మంచితనం, ఆ సాంప్రదాయం.. వీటిలో కొన్నయినా మనం పాటించ గలిగితే అదే ఆయనకు నిజమైన నివాళి. ప్రేమ, నాగేశ్వరరావుగారు తన జీవితాన్ని ఎప్పటికప్పుడు మదింపు చేసుకునేవారు. ఎప్పటికప్పుడు తనని తాను మలుచుకునేవారు. ఎలాంటి పాత్రయినా ఒదిగిపోయి నటించారు. అక్కినేని నాగేశ్వరరావు ఒక పెద్ద నటనా విశ్వవిద్యాలయం. సినిమా రంగంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ విద్యార్థి అనుకుంటే వారు జీవితంలో ఎంతో సాధించగలరు’’ అన్నారు.
Also Read