ఏయన్నార్ శతజయంతి: వైరల్ అవుతున్న చిరు ట్వీట్
on Sep 20, 2023
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో మెగాస్టార్ చిరంజీవికి మంచి అనుబంధమే ఉంది. వీరిద్దరు కలిసి మూడు దశాబ్దాల క్రితం 'మెకానిక్ అల్లుడు' (1993) సినిమాలో సందడి చేశారు. ఆ సినిమా ఫలితమెలా ఉన్నా.. ఏయన్నార్, చిరు మధ్య సాగే సన్నివేశాలు మాత్రం భలేగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాకి ముందు, తరువాత కూడా ఏయన్నార్ తో చిరు అనుబంధం సాగింది. కాగా, నేడు (సెప్టెంబర్ 20) ఏయన్నార్ శతజయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ స్పెషల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ లో చిరు ఏం ప్రస్తావించారంటే..
"శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను.
ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పటిమ, తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. తెలుగు సినిమా బ్రతికినంత వరకు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు.
ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా శ్రీ అక్కినేని కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ,
నా సోదరుడు
@iamnagarjunaకి, నాగేశ్వరరావుగారి కోట్లాది అభిమానులకు,
సినీ ప్రేమికులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు !! ".
Also Read