యూఎస్ లో 'వీరసింహారెడ్డి' రికార్డుల వేట మొదలైంది!
on Jan 3, 2023
'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా కావడంతో 'వీర సింహా రెడ్డి'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టింది.
యూఎస్ లో 'వీర సింహా రెడ్డి' అడ్వాన్స్ బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ఇంకా తొమ్మిది రోజుల సమయం ఉండగానే.. ప్రీ సేల్స్ లో అప్పుడే 100K(లక్ష) డాలర్ల మార్క్ ని దాటేసింది. యూఎస్ లో జనవరి 11 నుంచి ప్రీమియర్స్ ఉంటాయి. 'వీర సింహా రెడ్డి' జోరు చూస్తుంటే ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపే యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్క్ అందుకునేలా ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Also Read