వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ కి ముహూర్తం ఫిక్స్!
on Jun 1, 2023
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్ లో జరగనుందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలు నిజమేనని, వరుణ్-లావణ్య నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. వీరి నిశ్చితార్థం బంధువులు, సన్నిహితుల సమక్షంలో జూన్ 9న జరగనుందని సమాచారం.
కాగా వరుణ్, లావణ్య కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాలలో నటించారు. ఆ సినిమాలతో దగ్గరైన వీరు ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారని ఎప్పటినుంచో వార్తలు వినిపించాయి. మెగా ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఈవెంట్స్ లో లావణ్య కనిపించడం ఆ వార్తలకు బలం చేకూర్చింది. అయితే ప్రేమ విషయాన్ని వరుణ్ గానీ, లావణ్య గానీ అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు కొద్దిరోజుల క్రితం మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. త్వరలో తన కుమారుడుకి పెళ్లి చేయబోతున్నామని, ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ అధికారికంగా ప్రకటిస్తాడని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ తరుణం వచ్చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
పెద్దల అంగీకారంతో వరుణ్-లావణ్య పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిశ్చితార్థానికి, పెళ్ళికి ముహూర్తాలు ఖరారయ్యాయట. జూన్ 9న ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలుస్తుండగా.. ఈ ఏడాది చివరిలో వీరి వివాహాం జరగనుందని సమాచారం.
Also Read