యూత్ ని ఎంకరేజ్ చెయ్యాలె.. కొత్త కుర్రాళ్ళు హిట్ కొట్టారు!
on Jun 1, 2023
కొత్త కుర్రాడు సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'మేమ్ ఫేమస్'. ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాతో పలువురు నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా పరిచయమయ్యారు. ఇలా ఎందరో కొత్తవాళ్లు పనిచేసిన 'మేమ్ ఫేమస్' సినిమా మే 26న విడుదలై పరవాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూత్ ని బాగానే ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.
'మేమ్ ఫేమస్' థియేట్రికల్ బిజినెస్ వేల్యూ రూ.2 కోట్లని అంచనా. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.86 లక్షల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు రూ.79 లక్షలు, మూడో రోజు రూ.76 లక్షల గ్రాస్ తో సత్తా చాటింది. ఆ తర్వాత కూడా రోజుకి రూ.30-40 లక్షల రేంజ్ లో గ్రాస్ రాబడుతున్న ఈ చిత్రం ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.3.50 కోట్ల గ్రాస్(1.76 కోట్ల షేర్) వసూలు చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి రూ.1.08 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా రూ.4.59 కోట్ల గ్రాస్(రూ.2.23 కోట్ల షేర్) సాధించింది. ఓవరాల్ గా రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా, రూ.2.23 కోట్ల షేర్ తో ఆరు రోజుల్లోనే లాభాల్లోకి ఎంటరైంది. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో ఫుల్ రన్ లో ఈ చిత్రం మంచి లాభాలు రాబట్టే అవకాశముంది.
Also Read