ఎన్టీఆర్ సినిమా ట్యాగ్ లైన్ ని 'గుంటూరు కారం'కి పెట్టేశారు!
on Jun 1, 2023
'అతడు', 'ఖలేజా' సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్ర టైటిల్ ని, గ్లింప్స్ ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా నిన్న(మే 31న) విడుదల చేశారు. టైటిల్ ఎంత ఘాటుగా ఉందో, గ్లింప్స్ కూడా అంతే ఘాటుగా మాస్ ఆడియన్స్ మెచ్చేలా ఉంది. మహేష్ ఫ్యాన్స్ అయితే టైటిల్, గ్లింప్స్ చూసి ఫిదా అవుతున్నారు. అదే సమయంలో 'గుంటూరు కారం' టైటిల్ కి జోడించిన 'హైలీ ఇన్ ఫ్లేమబుల్'(highly inflammable) అనే ట్యాగ్ లైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఎప్పుడో 16 ఏళ్ళ క్రితం వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 'రాఖీ' సినిమాకి సైతం అప్పట్లో ఇదే ట్యాగ్ లైన్ పెట్టడం విశేషం.
ఎన్టీఆర్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో 'రాఖీ' ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 డిసెంబర్ లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆడపిల్లలను వేధించే వాళ్ళని పెట్రోల్ పోసి తగులబెట్టే రామకృష్ణ(రాఖీ) అనే పాత్రలో ఎన్టీఆర్ కనిపించాడు. సినిమా కాన్సెప్ట్ కి తగ్గట్టుగా 'హైలీ ఇన్ ఫ్లేమబుల్' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. అయితే ఇప్పుడు 16 ఏళ్ళు తర్వాత మహేష్ నటిస్తున్న కొత్త చిత్రం 'గుంటూరు కారం'కి అదే ట్యాగ్ లైన్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. గుంటూరు నేపథ్యంలో తెరకెక్కుతోన్న మాస్ ఎంటర్టైనర్ కాబట్టి 'గుంటూరు కారం' అనే పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టారని తెలుస్తోంది. అలాగే గుంటూరు కారం ఘాటుని తెలిపేలా 'హైలీ ఇంఫ్లేమబుల్' అనే ట్యాగ్ లైన్ పెట్టారని అర్థమవుతోంది. మొత్తానికి ఎన్టీఆర్ 'రాఖీ' సినిమా ట్యాగ్ లైన్ ని, మహేష్ 'గుంటూరు కారం'కి పెట్టడం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
Also Read