
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' షూటింగ్ సెట్స్ నుండి ఊహించని విధంగా కొన్ని యాక్షన్ క్లిప్స్ లీక్ అయ్యాయి.
ఇటీవల 'వారణాసి' మూవీ అవుట్‌డోర్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో తీసిన కొన్ని షార్ట్ వీడియో క్లిప్స్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ వీడియోల్లో మహేష్ బాబును 'బ్లడ్ బాత్' మాస్ అవతారంలో చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నెత్తుటి మరకలతో ఉన్న మహేష్, నీళ్ళలోకి దిగడం వంటి సీన్స్ చూసి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి.
అయితే లీక్డ్ వీడియోల విషయంలో మూవీ టీమ్ గరంగరంగా ఉంది. ఎవరైనా ఈ లీక్డ్ వీడియోను షేర్ చేస్తే వారి సోషల్ మీడియా అకౌంట్స్ ను సస్పెండ్ చేయడమే కాకుండా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.
ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.
Varanasi, Mahesh Babu, SS Rajamouli






