
సెల్యులాయిడ్ పై ఎన్నో చిత్రాల ద్వారా తన విలనిజంతో అభిమానులని, ప్రేక్షకులని భయపెట్టిన ప్రదీప్ రావత్ మొన్న నాలగవ తారీఖున అందర్నీ బాధకి గురి చేస్తూ క్యాన్సర్ తో చనిపోయిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓషివారా శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
తండ్రి మరణంపై విక్రమాదిత్య మాట్లాడుతు 'ఈ విషాదం కేవలం నెలన్నర వ్యవధిలోనే జరిగిపోయింది. అంతకంటే ముందు అసలు ఏ సమస్య లేదు. సరిగ్గా 2 నెలల క్రితమే నాన్నకి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించాం. ఆ నివేదికల్లో ఆరోగ్యం 100 శాతం పూర్తి ఆరోగ్యంగా ఉన్న్టట్లు వచ్చింది. అయితే కొన్ని రోజుల క్రితం సాధారణ కడుపు నొప్పితో బాధపడుతుంటే, ప్రాథమికంగా వైద్యులు చిన్న స్టమక్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుందని భావించి కొన్ని మందులు ఇచ్చారు. కానీ ఎన్ని మందులు వాడినా నొప్పి తగ్గకపోగా, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వెంటనే రక్తం పరీక్షలు చేయించగా, రక్తంలో తెల్ల రక్తకణాల (వైట్ బ్లడ్ సెల్స్ - WBC) సంఖ్య ఊహించని రీతిలో అత్యధికంగా పెరిగిపోయినట్లు తేలింది. దీంతో వెంటనే ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం 99 శాతం నాన్నకి బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ మరుసటి రోజే వేగంగా వ్యాపించే 'అగ్రెసివ్ బ్లడ్ క్యాన్సర్' ఉందనే ఘోరమైన నిజాన్ని వైద్యులు చెప్పారు. . కేవలం రెండు నెలల క్రితం వరకు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న మనిషి, నెలన్నర రోజుల్లోనే క్యాన్సర్ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతారని తాము కలతైనా ఊహించలేదు.
Also read: Salman Khan: చీటింగ్ కేసులో సల్మాన్ ఖాన్, సోదరి అల్విరా.. ఆ బిజినెస్ మాన్ ఏం చెప్పాడంటే!
మేము ఐసీయూ గది బయట ఆందోళనగా వేచి చూస్తున్నాము. డాక్టర్లు లోపలికి పరుగులు తీశారు. నేను గది తలుపు తెరచి చూడగా, వైద్యులు నాన్న గుండెను పునరుద్ధరించేందుకు సీపీఆర్ (CPR) అందిస్తున్నారు. ఆ దృశ్యం చూడగానే నాన్న మనల్ని వదిలి వెళ్లిపోతున్నారనే చేదు నిజాన్ని అర్థం చేసుకున్నాను అని భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపుగా పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో సినిమాలు చేసిన ప్రదీప్ రావత్ సై’, ఛత్రపతి’, ‘దేశముదురు’, ‘గజిని’, ‘స్టాలిన్ వంటి చిత్రాల్లో చేసిన సినిమాలు బాగా పేరు తీసుకొచ్చాయి. చివరిగా మే 1 న విడుదలైన గాయపడ్డ సింహం మూవీలో కనిపించాడు. వయసు 74 ఏళ్ళు.
Pradeep Rawat, Vikramaditya Rawat





