Home

»

Latest News

ఆ విషయంలో డబ్బు సంపాదిస్తే తప్పేంటి.. మల్లికా షెరావత్ సంచలన వ్యాఖ్యలు

Aug 6, 2026 1:04PM

 

మల్లికా షెరావత్(mallika sherawat)..ఈ పేరుకి ఉన్న చరిష్మాకి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉండటం జరగని పని. రొమాన్స్ క్వీన్ గా  ముద్రపడిన మల్లికా వల్ల యు ట్యూబ్  కళలాడుతూ ఉంది. ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే మల్లికా వీడియోస్ కి ఉన్న వ్యూస్ ని చెక్ చేసుకోవచ్చు.ఫ్యాన్స్ ఐతే మల్లికా  వీడియోస్ ని చూడని రోజంటూ ఉండదు. ఎప్పుడూ ఓపెన్ మైండెడ్ సమాధానాలు, బోల్డ్ కామెంట్లతో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ ముద్దు గుమ్మ  ఇటీవల ఒక రియాలిటీ షో కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారనే ప్రచారంపై స్పందించారు. 

 మల్లికా మాట్లాడుతు 'అవును, నేను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను.  కష్టపడి పని చేసి డబ్బు సంపాదించడంలో ఏమాత్రం తప్పు లేదు.శ్రమకి తగ్గ ప్రతిఫలం అడగడం ప్రతి ఒక్కరి హక్కు. ఈ విషయంలో నేను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు,  సినీ పరిశ్రమలో మహిళలు తమ ప్రతిభకి  తగ్గ పారితోషికం పొందినప్పుడు ఎందుకు విమర్శిస్తారో అర్థం కాదని ఆమె ప్రశ్నించారు. ప్రముఖ దర్శకుడు  కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ది ట్రెయిటర్స్ ఇండియా' (The Traitors India) అనే పాపులర్ రియాలిటీ షోలో ఆమె ఒక కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నారు. ఆగస్టు 13 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ప్రసారం కానున్న ఈ షో కోసం మల్లికా షెరావత్‌కు భారీ మొత్తం చెల్లించినట్లు వార్తలు వచ్చాయి.

Also read; Pradeep Rawat: ప్రదీప్ రావత్ మరణంపై కొడుకు సంచలన వ్యాఖ్యలు.. ఆ మందు ఇచ్చింది ఎవరు

 తన 22 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, వివాదాలు ఎదుర్కొన్న మల్లికా షెరావత్, ఎప్పుడూ తన మనసులోని మాటలను నిర్మోహమాటంగా బయటపెట్టడానికే మొగ్గు చూపుతారు. 'ఖ్వాహిష్', 'మర్డర్' వంటి సినిమాలతో  బోల్డ్ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లికా తన సుదీర్ఘ కెరీర్‌లో కేవలం రెండు హిట్స్ మాత్రమే అందుకుంది. కానీ అభిమానులు మాత్రం ఒప్పుకోరు. ఒక్కో ఐటమ్ సాంగ్‌కి  1.5 కోట్ల వరకు పారితోషికం తీసుకునే నటిగా రికార్డు కూడా మల్లికా పేరుపై ఉంది.

Mallika Sherawat, Bollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com