36 ఏళ్ళ `వజ్రాయుధం`!
on Jul 5, 2021

సూపర్ స్టార్ కృష్ణకి అచ్చొచ్చిన దర్శకుల్లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఒకరు. వీరిద్దరు జట్టుకట్టిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. `భలే కృష్ణుడు` (1980), `ఘరానా దొంగ` (1980), `ఊరికి మొనగాడు` (1981), `అడవి సింహాలు` (1983), `శక్తి` (1983), `ఇద్దరు దొంగలు` (1984), `అగ్నిపర్వతం` (1985) వంటి జనరంజక చిత్రాల తరువాత కృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన సినిమా `వజ్రాయుధం` (1985). కృష్ణ కథానాయకుడిగా రాఘవేంద్రరావు రూపొందించిన చివరి చిత్రమిదే కావడం విశేషం. పగ, ప్రతీకారం అంశాలు కలిగిన ఈ ఫార్ములా కథని తనదైన శైలిలో, ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కించారు దర్శకేంద్రుడు.
కృష్ణకి జంటగా శ్రీదేవి నటించిన ఈ సినిమాలో రావుగోపాలరావు, సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, రాజా, ప్రభాకరరెడ్డి, చలపతిరావు, కాంతారావు, అశ్వని, శుభ, శ్యామలగౌరి, బేబి సీత ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించిన ఈ చిత్రానికి కె.ఎస్. ప్రకాశ్ ఛాయాగ్రహణం అందించారు.
చక్రవర్తి సంగీతమందించిన `వజ్రాయుధం`కి వేటూరి సాహిత్యమందించారు. పాటల్లో ``ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా``, ``సన్నజాజి పక్క మీద`` చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 1985 జూలై 5న విడుదలై జననీరాజనాలు అందుకున్న `వజ్రాయుధం`.. నేటితో 36 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



