అందరూ భయపడ్డారు.. హన్సిక ధైర్యంగా ముందుకొచ్చింది
on Jul 5, 2021

హన్సిక నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం 'మై నేమ్ ఈజ్ శ్రుతి'. హన్సిక 52వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేంద్రరాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవి కెమెరా స్విచ్చాన్ చేయగా, రేవతి క్లాప్ ఇచ్చారు. వంశీ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హన్సిక మాట్లాడుతూ.. "తెలుగు సినిమాలతోనే నా ప్రయాణం మొదలైంది. టాలీవుడ్ నాకు మంచి పేరును తీసుకొచ్చింది. తెలుగులో మరో మంచి సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలతో ధైర్యంగా తన మనో భావాలను వ్యక్తపరచే మనస్తత్వం కలిగిన శ్రుతి అనే యువతిగా ఈ సినిమాలో కనిపిస్తా. ఆద్యంతం మలుపులతో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది." అని తెలిపింది.

దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ.. ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని చెబుతుంటారు. అలాగే ప్రతి మహిళ సంఘర్షణ వెనుక మగాడు ఉంటాడు. తన జీవితంలో ఎదురైన సంఘర్షణను ఓ యువతి ఎలా ఎదుర్కొన్నదన్నది ఈ చిత్ర ఇతివృత్తం అని చెప్పారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో హన్సిక నటిస్తున్న చిత్రమిది. తప్పకుండా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. సినిమాలో తర్వాత ఏం జరుగుతుందనే ప్రేక్షకుల ఊహకు అందదు. ఇలాంటి ట్విస్ట్ లతో ఇప్పటివరకు వెండితెరపై సినిమా రాలేదు. నటన పరంగా లీడ్ రోల్ చాలెంజింగ్ గా ఉంటుంది. కథ విన్న తర్వాత ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా మంది భయపడ్డారు. హన్సిక ధైర్యంగా ఈ సినిమాను అంగీకరించింది అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



