తారక్, కేటీఆర్, చిరులను కలిసిన పువ్వాడ అజయ్!
on Jul 5, 2021

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనయుడు నయన్ రాజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ తన కుమారుడుతో కలిసి వెళ్లి పలువురు ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలిశారు. పువ్వాడ కలిసిన వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మినిస్టర్ కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. ఈ విషయాన్ని పువ్వాడ అజయ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. వారితో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు.

"నా తనయుడు Dr.పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్బంగా తారక్ గారిని మర్యాదపూర్వకంగా కలవడమైంది." అంటూ అజయ్ ట్వీట్ చేశారు. తారక్ తో పాటు కొరటాల శివని కూడా కలిశారు.

"నేడు నా తనయుడు Dr. పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది." అంటూ కేటీఆర్ ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.

"నా తనయుడు Dr.పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్బంగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కలవడమైంది." అని అజయ్ ట్వీట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



