ఉత్తరాంధ్రలో 'అరవింద సమేత'ను దాటేసిన 'ఉప్పెన'!
on Mar 3, 2021
పంజా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోటే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఏ స్టార్ ఫస్ట్ ఫిల్మ్‌కూ రాని కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆఖరుకి ఇప్పటికీ పలువురు స్టార్లకు సాధ్యంకాని రూ. 50 కోట్ల షేర్ మార్క్‌కు అంగుళం దూరంలో ఉన్నాడు. మూడో వారంలోనూ 'ఉప్పెన' కలెక్షన్లు స్టడీగా ఉండటం, రంగంలో ఉన్న మిగతా అన్ని సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు వస్తుండటం విశేషం.
కృతి శెట్టి సెన్సేషనల్ తారగా అవతరించిన 'ఉప్పెన' ఉత్తరాంధ్ర ఏరియాలో మరో సంచలనం సృష్టించింది. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ మునుపటి సినిమా 'అరవింద సమేత' సాధించిన ఓవరాల్ కలెక్షన్లను 11 రోజుల్లో 'ఉప్పెన' అధిగమించడం విశేషం. త్రివిక్రమ్-తారక్ కాంబినేషన్ ఫిల్మ్ అక్కడ రూ. 7.5 కోట్ల షేర్ సాధించింది. ఆ ఏరియాలో 11 రోజులకు 'ఉప్పెన' వసూళ్లు రూ. 7.55 కోట్లు! అక్కడ ఈ సినిమా రూ. 8 కోట్ల మార్క్‌ను అందుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా రూపొందించిన 'ఉప్పెన'లో విజయ్ సేతుపతి విలన్‌గా సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగా, దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఆ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
