`సిద్ధ` కోసం బుట్టబొమ్మ సిద్ధం
on Mar 4, 2021
వరుస అవకాశాలతో, విజయాలతో ముందుకు సాగుతున్న కథానాయిక పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ చేతిలో `రాధేశ్యామ్`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` చిత్రాలు ఉన్నాయి. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టిస్టారర్ మూవీ `ఆచార్య` లోనూ 20 నిమిషాల పాత్రలో ఈ స్టన్నింగ్ బ్యూటీ సందడి చేయనుందని టాక్.
ఇప్పటివరకు `ఆచార్య`లో పూజా హెగ్డే ఎంట్రీపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా.. సదరు సోషల్ డ్రామాలో అమ్మడి చేరిక దాదాపు ఖాయమన్నట్లుగానే వార్తలు వస్తున్నాయి. అలాగే.. `సిద్ధ` పాత్ర
పోషిస్తున్న రామ్ చరణ్ కి జోడీగా బుధవారం నుంచి పూజా హెగ్డే కూడా షూటింగ్ లో జాయిన్ అయిందని అంటున్నారు. త్వరలోనే టీమ్ నుంచి పూజ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని
బజ్.
మరి.. `జిల్ జిల్ జిగేల్ రాణి` అంటూ చరణ్ తో `రంగస్థలం`లో ప్రత్యేక గీతం చేసి అలరించిన పూజ.. `ఆచార్య`లోని ప్రత్యేక పాత్రతో ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
