కొత్త బాయ్‌ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన ఇలియానా!
on Mar 3, 2021
గోవా బ్యూటీ ఇలియానా లవ్, లైఫ్‌తో పాటు హిందీ సినిమాల్లో స్టార్ హీరోలకు జోడీగా చేసిన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. పూరి జగన్నాథ్‌తో మూడు సినిమాలు ఎలా చేసిందనే విషయం కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌లో తెలిపింది.
ఒక ఫాలోయర్ ఆమెను ప్రేమకు మీరిచ్చే నిర్వచనం ఏంటని అడిగితే, "అన్‌కండిషనల్ (బేషరతు)" అని ఆన్సర్ ఇచ్చింది ఇలియానా. ఆమె బాయ్‌ఫ్రెండ్ పేరు చెప్పమంటే, తన పెట్ డాగ్‌తో ఉన్న పిక్చర్‌ను షేర్ చేసి, "చార్లీ" అని రాసింది. అంటే ప్రస్తుతానికి ఆమె బాయ్‌ఫ్రెండ్ చార్లీ అన్నమాట. ఇదివరకు ఆమె ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో కొంతకాలం పాటు డేటింగ్ చేసింది. అయితే 2019 ఆగస్ట్‌లో వారు విడిపోయారు. అప్పట్నుంచీ ఆమె సింగిల్‌గానే ఉంటోంది.
"అందం కోసం మీరెప్పుడైనా సర్జరీ చేయించుకున్నారా?" అని ఒక ఫ్యాన్ అడిగాడు. దానికి “Nope” అనేది ఇలియానా ఆన్సర్. పైగా దానికి మూతి వంకరగా పెట్టిన పిక్చర్‌ను జోడించింది. తను స్క్రీన్ షేర్ చేసుకున్న వారిలో అభిమాన నటుడెవరో కూడా ఆమె వెల్లడించింది.
మీ ఆల్‌టైమ్ ఫేవరేట్ కో-స్టార్ ఎవరని అడిగిన ప్రశ్నకు, వరుణ్ ధావన్‌తో కలిసున్న పిక్చర్‌ను షేర్ చేసింది ఇలియానా. ఆ ఇద్దరూ కలిసి 'మై తేరా హీరో'లో జంటగా నటించారు. అది రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ రూపొందించిన హిట్ ఫిల్మ్ 'కందిరీగ'కు రీమేక్.
డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో ఆమె మూడు సినిమాలు.. పోకిరి, నేను నా రాక్షసి, దేవుడు చేసిన మనుషులు.. చేసింది. ఆయన గురించి అడిగితే, ఆయనతో దిగిన రెండు పిక్చర్స్‌ను షేర్ చేసి, "ఇది చాలా కాలం నాటిది. కానీ నేను పనిచేసిన నా ఫేవరేట్ పీపుల్‌లో ఆయన ఒకరు. మేం కలిసి మూడు సినిమాలు చేయడం వండర్ ఏమీ కాదు." అని చెప్పింది. అంతేకాదు.. పూరిని తన "డెమీగాడ్ (దేవుడు)"గా అభివర్ణించింది 'పోకిరి' సుందరి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
