ఉపాసనకు యూఏఈ గోల్డెన్ వీసా! క్రిస్మస్ కానుక ఉంటూ మురిసిపోయిన చిరు కోడలు!!
on Dec 27, 2021

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం లభించింది. ఉపాసనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం గోల్డెన్ వీసా అందజేసింది. క్రిస్మస్ రోజున ఉపాసన ఈ గౌరవాన్ని అందుకున్నారు. యూఏఈ ఇచ్చిన గోల్డెన్ వీసా తనకు క్రిస్మస్ కానుక అంటూ సంబరపడిపోయారు ఉపాసన. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. ఇప్పుడు తాను ప్రపంచ పౌరురాలిని అంటూ ఉపాసన మురిసిపోయారు. ప్రముఖుల గౌరవార్థం ఇలా గోల్డెన్ వీసాను అందజేస్తారు. ఉపాసన కొణిదెల అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే జరిగిన ఇండియా ఎక్స్ పో-2020 ద్వారా ఈ ప్రపంచం అంతా ఒక్కటే అని తనకు తెలిసిందని, ‘వసుధైక కుటుంబం’ అనే భావనకు అర్థం తెలిసిందని ఉపాసన ట్విట్ చేశారు. ఈ క్రమంలోనే యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఉపాసన పేర్కొన్నారు. మనసా వాచా తాను భారతీయురాలినని, అయితే.. అన్ని దేశాల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని వెల్లడించారు. గోల్డెన్ వీసా రావడంతో తాను ఇప్పుడు ప్రపంచ పౌరురాలిని అయ్యానని ఆమె సంతోషంగా చెప్పుకున్నారు.
Also read: తెలుగునాట 75 శాతం రికవరీ అయిన 'పుష్ప'.. తెలంగాణలో ప్రాఫిట్స్ మొదలయ్యాయ్!
యూఏఈలో చదువుకోవాలనుకునే, వ్యాపారం చేయాలనుకునే, ఉద్యోగం కావాలనుకునే విదేశీయులకు స్థానికులు ఎవరైనా స్పాన్సర్ చేయాలనే నిబంధన ఉంది. అయితే.. గోల్డెన్ వీసా ఉంటే అక్కడి స్థానికుల స్పాన్సర్ షిప్ లేకుండా చదువుకోవచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. ఎందుకంటే గోల్డెన్ వీసా ఉన్నవారిని పూర్తి యూఏఈ పౌరులుగా పరిగణిస్తారు.
Also read: తెలుగునాట 'అఖండ' లాభం 30 శాతం.. తెలంగాణలో మాత్రం 87 శాతం!
భారతదేశంలోని పలువురు ప్రముఖుల్లో యూఏఈ గోల్డెన్ వీసా పొందినవారున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మలయాళ సినీ నటులు మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్రకు గోల్డెన్ వీసాలు ఉన్నాయి. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుటుంబానికి కూడా యూఏఈ గోల్డెన్ వీసా ఉంది. దీర్ఘకాలం అమలులో ఉండేవి గోల్డెన్ వీసాలు. వాటిని ఐదేళ్లు, పదేళ్ల ప్రాతిపదికన జారీ చేస్తారు. ఆ వీసాల కాల వ్యవధి ముగిసే సమయానికి అవి ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



