అనుకున్న టైమ్‌కే 'ఆర్ఆర్ఆర్' రిలీజవుతుంది.. ధ్రువీకరించిన దానయ్య!
on Dec 27, 2021

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందించిన ఎపిక్ డ్రామా 'ఆర్ఆర్ఆర్' జనవరి 7న తప్పకుండా విడుదలవుతుందని నిర్మాత డీవీవీ దానయ్య ధ్రువీకరించారు. దేశంలోని కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూలు ఉండటం, మహారాష్ట్రలోని థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతుండటం, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు అతి తక్కువగా ఉండటం లాంటి కారణాలతో 'ఆర్ఆర్ఆర్' విడుదల వాయిదాపడే అవకాశం ఉందంటూ వదంతులు వచ్చాయి. అయితే మీడియాతో మాట్లాడిన దానయ్య, "రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పూ లేదు. జనవరి 7న మేం సినిమా విడుదల చేయబోవడం లేదంటూ అనేక వదంతులు వస్తున్నాయి. వాటిలో ఏమాత్రం నిజం లేదు, అనుకున్న టైమ్‌కే 'ఆర్ఆర్ఆర్' రిలీజవుతుంది" అని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ ధరలు బాగా తక్కువగా ఉండటంతో, వాటి విషయంలో పునరాలోచించాలని ప్రభుత్వానికి టాలీవుడ్ విజ్ఞప్తి చేసింది. అయితే ఇంతదాకా వై.ఎస్. జగన్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య తమ సినిమా కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని సినిమా టీమ్ కాన్ఫిడెంట్‌గా ఉంది. విడుదలైన మొదటి రోజే 'ఆర్ఆర్ఆర్' రూ. 100 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 6000 స్క్రీన్లలో విడుదలవుతోంది.
ఇంతదాకా 'ఆర్ఆర్ఆర్'కు సంబంధించిన అన్ని రకాల ప్రమోషనల్ కంటెంట్‌ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాని ప్రమోట్ చేయడానికి హీరోలు, దర్శకుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, సీతగా ఆలియా భట్ నటించారు. ఒలీవియా మోరిస్, అలీసన్ డూడీ, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రకని కీలక పాత్రలు చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



