Home

»

Latest News

‘టైసన్‌ నాయుడు’ టీజర్‌.. పవర్‌ఫుల్‌ పోలీస్‌ కథతో బెల్లంకొండ మాస్‌.!

Nov 19, 2026 11:09AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నుంచి చాలాకాలంగా ఎదురుచూస్తున్న సినిమా ‘టైసన్‌ నాయుడు’. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో సాయి శ్రీనివాస్‌ను పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా చూపించారు. అయితే ఈ టీజర్‌లో యాక్షన్‌ మాత్రమే కాదు.. కథలో ఆసక్తి రేపే ఓ కొత్త పాయింట్‌ కూడా ఉంది.

టీజర్‌లో ప్రధానంగా చూపించిన విషయం SOT (స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌). పదే పదే నేరాలకు పాల్పడుతూ సమాజానికి ఇబ్బందులు సృష్టించే వ్యక్తులను కట్టడి చేయడానికి ఈ ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చూపించారు. అయితే ఈ టీమ్‌ సాధారణ పోలీసుల్లా అరెస్టులు చేయదు.. అధికారిక రికార్డులు కూడా నిర్వహించదు. అక్కడికక్కడే శిక్ష విధించే విధంగా వారి వ్యవహారం ఉంటుంది.

ఇదే కథలో ఆసక్తికరమైన పాయింట్‌. చట్టం పరిధిలో పనిచేయాల్సిన పోలీసులే ఇలా ప్రత్యేకంగా వ్యవహరిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు అలాంటి వ్యవస్థకు అధికారం ఎవరిచ్చారు? అనే ప్రశ్నలు టీజర్‌ చూస్తే కలుగుతాయి.

టీజర్‌లో మరో కీలకమైన అంశం రెడ్‌ ట్యాగింగ్‌. కొందరిని ఉగ్రవాదులు/ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేసి లక్ష్యంగా చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఓ వర్గం నిరసన తెలుపుతున్నట్లు కనిపిస్తుంది. శత్రు నేతృత్వంలో ఓ నిరసన బృందం కనిపిస్తుండగా.. మరోవైపు పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఈ గొడవ వెనుక అసలు కారణం ఏమిటి? నిరసనకారులను పోలీసులు ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? అనేది ఆసక్తిని పెంచుతోంది.

ఇది కూడా చదవండి: విలన్‌గా గోపీచంద్ రీఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్.!

ఇదంతా ఏదో సాధారణ పోలీస్‌ కథలా కాకుండా.. ఓ వ్యవస్థ, దాని అధికారాలు, దానికి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తుల మధ్య సంఘర్షణగా ఉండబోతుందనే భావన కలుగుతోంది. అయితే టీజర్‌ కథ మొత్తాన్ని రివీల్‌ చేయకుండా సస్పెన్స్‌ మెయింటైన్‌ చేసింది.

సాయి శ్రీనివాస్‌ ఈ సినిమాలో చాలా అగ్రెసివ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఇంటెన్స్‌ లుక్‌, యాక్షన్‌ సన్నివేశాలతో తన మాస్‌ ఇమేజ్‌కు తగ్గ పాత్రలో కనిపించారు. టీజర్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రజ్ఞా జైస్వాల్‌ కూడా టీజర్‌లో మెరిశారు. నరేశ్‌, రావు రమేశ్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘భీమ్లా నాయక్‌’ సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభ చూపించిన సాగర్‌ కె. చంద్ర.. ఈసారి ఓ కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు టీజర్‌ చెబుతోంది. ముకేష్‌ జ్ఞానేశ్‌ సినిమాటోగ్రఫీ, భీమ్స్‌ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ యాక్షన్‌ వాతావరణానికి బలాన్నిచ్చాయి.

మీకు నచ్చవచ్చు:
వారణాసి వాయిదా.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.?
రెండేళ్లుగా మంచానికే పరిమితమైన స్టార్.. కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ స్టోరీ.!

 

 

 

[Tyson Naidu Teaser, Bellamkonda Sreenivas, Saagar K Chandra, Neha Shetty, Pragya Jaiswal]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com