కిడ్నాపర్ల నుంచి మేకప్ మాన్ ని కాపాడిన హీరో
on Apr 5, 2025
పలు రకాల సీరియల్స్ లో వివిధ క్యారెక్టర్స్ లో నటిస్తు అభిమానుల మనసు చూరగొంటూ వస్తున్నారు ఇంద్ర నీల్, మేఘన.ఈ ఇద్దరికి పర్సనల్ మేకప్ మాన్ గా భూమిరెడ్డి కిషోర్ రెడ్డి పని చేస్తున్నాడు.కిషోర్ రెడ్డి తన మిత్రులైన శివ, సందీప్ తో కలిసి హైదరాబాద్ కృష్ణానగర్ లోని ఒక ఇంట్లో అద్దెకి ఉంటున్నా డు.శివ వేరే వర్గానికి చెందిన ఒక అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ వదిలి వెళ్లడంతో ఈ నెల 2 వ తారీఖున పోలీస్ స్టిక్కర్ ఉన్న కారులో ఇద్దరు వచ్చి శివ ఆచూకీ చెప్పాలంటు కిషోర్ రెడ్డి, సందీప్ ని పోలీస్ స్టేషన్ కని బలవంతంగా చెప్పి తీసుకెళ్లారు.
కానీ పిఎస్ కి తీసుకెళ్లకుండా హైదరాబాద్ శివారులోని తుక్కుగూడ లోని ఒక అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.మరో పది మందితో కలిసి కిషోర్ రెడ్డి,సందీప్ ని చెట్టుకి కట్టేసి కొడుతు శివ,యువతీ ఆచూకీ చెప్పాలని చిత్ర హింసలకి గురి చేసి అనంతరం ఇద్దర్నిఅచ్చంపేట కి తీసుకెళ్లారు.కిషోర్ రెడ్డి విధుల్లోకి రాకపోవడంతో ఇంద్రనీల్ కి అనుమానం వచ్చి కిషోర్ రెడ్డి సెల్ నెంబర్ కి ఫోన్ చేసాడు.దీంతో కిడ్నాపర్లు లైన్ లోకి రాగా వాళ్ళతో ఇంద్రనీల్ మాట్లాడాడు.అనంతరం కిషోర్,సందీప్ ని తీసుకొని కిడ్నాపర్లు అచ్చంపేట పిఎస్ కి వచ్చారు.అనంతరం ఆ ఇద్దర్ని తీసుకొని ఇంద్రనీల్ హైదరాబాద్ వచ్చాడు.కిషోర్ రెడ్డి, సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోహైల్,ఇబ్బుతో పాటు మరికొందరిపై కిడ్నాప్,దాడి తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.తన మేకప్ మెన్ ని కాపాడి ఇంద్రనీల్ రియల్ హీరో అనిపించుకున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు
చక్రవాకం,కాలచక్రం వంటి సీరియల్స్ ద్వారా ఇంద్ర నీల్ టీవీ ప్రేక్షకులో మంచి గుర్తింపు పొందాడు. మేఘన కూడా ఆ రెండు సీరియల్స్ లో నటించి అనంతరం చాలా సీరియల్స్ లో అత్త క్యారక్టర్ లో నటించి పేరు ప్రఖ్యాతులు పొందింది.ఆ రెండు సీరియల్స్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడి ఇంద్ర నీల్.మేఘన పెళ్లి కూడా చేసుకున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
