టెస్ట్ మూవీ రివ్యూ
on Apr 5, 2025
మూవీ : టెస్ట్
నటీనటులు: మాధవన్, నయనతార, సిద్దార్థ్, మీరా జాస్మిన్, నాజర్ తదితరులు
ఎడిటింగ్: టి.ఎస్ సురేష్
మ్యూజిక్: శక్తిశ్రీ గోపాలన్
సినిమాటోగ్రఫీ: విరాజ్ సింగ్ గోహిల్
నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్. శశికాంత్
దర్శకత్వం: ఎస్. శశికాంత్
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్
కథ:
అర్జున్ వెంకట్‌రామన్ (సిద్ధార్థ్) ఇండియన్ టాప్ క్రికెటర్లలో ఒకరు. కానీ, అతడి బ్యాడ్ ఫామ్ కారణంగా బోర్డు అతడిని రిటైర్ చేయాల్సిందిగా కోరుతుంది. దీనికి అతను ఒప్పుకోడు. స్కూల్ టీచర్ అయిన కుముద(నయనతార) IVF పద్దతి ద్వారా తల్లి కావాలని కోరకుంటుంది. సైంటిస్ట్ అయిన ఆమె భర్త శరవణన్(మాధవన్) దేశ భవిష్యత్తును మార్చగల ఓ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తుంటాడు. వీరి ముగ్గురు జీవితాల్లో ఎదురైన క్లిష్టమైన పరిస్థితులు ఏమిటి..? వారు ఈ పరిస్థితులను ఎలా ఎదురించారు? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
స్పోర్ట్స్ డ్రామా అంటేనే తెలుగు యువతని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఎమె.ఎస్ ధోనీ సినిమా చూసిన ప్రతీ సినీ ప్రేక్షకుడు అలాంటి యథార్థ కథల కోసం అన్వేషిస్తూ ఉంటాడు. క్రికెట్ అభిమానులకి ఈ టెస్ట్ మూవీ కొంత వరకు నచ్చుతుంది. అది కూడా చివరి ముప్పై నిమిషాలు. ఎందుకంటే ఆ క్లైమాక్స్ లోనే క్రికెట్ కి సంబంధించిన స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కించారు. అది తప్ప మిగతాదంత సాధారణ రెగ్యులర్ కథలా ఉంటుంది. క్యారెక్టర్లని సరైన పద్ధతిలో దర్శకుడు వాడుకోలేదు. ముఖ్యంగా అర్జున్ పాత్రని ఇంకాస్త ఛాలెంజింగ్ రాస్తే బాగుండేది.
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మినీ యుద్ధాన్ని తలపిస్తుంది. అలాంటిది ఓ టెస్ట్ సిరీస్ లో ఇండియా గెలవాల్సిన మ్యాచ్ లో అర్జున్ తన కొడుకు కోసం ఇలా చేసాడంటూ వచ్చే సీక్వెన్స్ అంతా కూడా సినిమా కథని పక్కదోవ పట్టించింది. ఒక్క సీన్ కూడా ప్రేక్షకులు గుర్తుంచుకునే విధంగా లేదు. ముఖ్యంగా సిద్ధార్థ్ ఉన్న సీన్స్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. ఇలాంటి స్టార్ క్యాస్టింగ్‌ను సెట్ చేసుకున్న దర్శకుడు ఎస్.శశికాంత్ వారికి గుర్తుండిపోయే పాత్రలను అందించడంలో ఫెయిల్ అయ్యాడు.
స్పోర్ట్స్ డ్రామా సినిమాలు ఎంగేజింగ్ థ్రిల్లర్ లా సాగుతూనే వాటికి అభిమానులు కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ పోర్షన్ లో ఉండటం.. క్రికెట్ పోర్షన్ తక్కువగా ఉండటంతో.. బిర్యానీలో మసాలా, ముక్కలు రానట్టుగా సప్పగా సాగిపోయింది. సినిమాని గంట వరకు ఉంచితే అన్నీ పర్ఫెక్ట్ గా ఉండేది. చాలా వరకి అనవసరమైన సీన్లే ఎక్కువగా ఉన్నాయి. మాధవన్, నయనతార మధ్య వచ్చే ఓ సాంగ్ చాలా బాగుంది. మొదటి నుండి చివరి వరకు స్లో సీన్లే ఎక్కువగా ఉంటాయి. కానీ క్లైమాక్స్ సంతృప్తినిస్తుంది. అయితే అప్పటికే ఈ టెస్ట్ సినిమాని చూసే ఆడియన్ కి అగ్నిపరీక్షలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ ఒకే. ఎడిటింగ్ ఇంకా బాగా చేయొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
అర్జున్ గా సిద్దార్థ్, కుముదగా నయనతార, శరవణన్ అ మాధవన్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. నాజర్ పాత్ర కొంతవరకే ఉంది. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : ఈ టెస్ట్ ఫెయిల్ అయింది. ఓపికకి పరీక్ష పెట్టే టెస్ట్ ఇది.
రేటింగ్ : 2 / 5
✍️. దాసరి మల్లేశ్
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
