రానా, త్రిష.. ఓ ఘాటు ముద్దు
on Mar 4, 2017

రానా, త్రిషల మధ్య ప్రేమాయణం నడిచిందని చాలా కాలం క్రితం వార్తలొచ్చాయి. వీళ్లిద్దరూ కలసి ఒక్క సినిమాలోనూ నటించకపోయినా... లవ్వు ఎలా కుదిరిందబ్బా...? అంటూ ఆశ్చర్యపోయారంతా. అయితే.. పబ్ లలోనూ, పేజీ 4 వార్తల్లోనూ వీరిద్దరూ తెగ కనిపించేవారు. త్రిష దగ్గర రానా గురించి, రానా సంగతి త్రిష దగ్గర అడిగినా నోరు మెదిపేవారు కాదు. అయితే... వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందనడానికి ఇప్పుడో సాక్ష్యం దొరికింది.
రానా, త్రిషలు ముద్దుల్లో మునిగిపోయినప్పటి ఓ ఫొటో ఇప్పుడు బయటకు వచ్చింది. తమిళ గాయని సుచిత్ర... సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఓ ఫొటో విడుదల చేసింది. ఆ ఫొటో చూసి అంతా ముక్కున వేలేసుకొంటున్నారు. త్రిషని రానా గాఢంగా ముద్దు పెడుతుంటే.. త్రిష బహు రొమాంటిక్ గా ఫీలైపోతున్న దృశ్యమది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారనడానికి ఇంతకు మించిన రుజువేం కావాలి. అన్నట్టు.. ఆ తరవాత త్రిష ఓ వ్యాపార వేత్తకి దగ్గరవ్వడం, ఇద్దరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరగడం, పెళ్లికి కొద్ది రోజుల ముందు ఈ బంధం బీటలు వారడం ఇవన్నీ తెలిసిన విషయాలే. అప్పటి నుంచి రానా, త్రిషల మధ్య దూరం పెరిగింది. ఈ ఫొటో పాత జ్ఞాపకాల్ని తట్టి లేపుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



