కాటమరాయుడు టైటిల్ సాంగ్ రివ్యూ
on Mar 3, 2017

నాయకుడై నడిపించేవాడు... సేవకుడై నడుం వంచే వాడు... అందరికోసం అడుగేశాడు.. కాటమరాయుడు. ఇదీ పవన్ కళ్యాణ్ తాజా చిత్ర కాటమరాయుడు టైటిల్ సాంగ్. కిషోర్ కుమార్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్ కొద్దిసేపటి క్రితమే విడుదలైయింది. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ సాంగ్ అంటే చాలా ప్రత్యేకం. ఆయన టైటిల్ సాంగ్ అదిరిపొతుంటుంది. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్..ఆరడుగుల బులెట్..ఇలా జనాల నోట్లో నానుతుంటాయి పవన్ కళ్యాణ్ టైటిల్ సాంగ్స్. ఇప్పుడు కాటమరాయుడు టైటిల్ సాంగ్ కూడా క్యాచిగానే వుంది. పవన్ సినిమా టైటిల్ సాంగ్ ను కంపోజ్ చేయడం ఏ సంగీత దర్శకుడికైనా పెద్ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ను అనూప్ రూబెన్స్ సమర్దవంతగా పూర్తి చేసినట్లు అనిపిస్తుంది. పాట ఎత్తుకోవడమే క్యాచి నోట్స్ తో సాగింది. బేస్ గిటార్ లో థీం ట్యూన్ ప్లే చేస్తూ తర్వాత క్యాచి రిధమ్ డ్రమ్ బీట్స్ ''రాయుడో'' అంటూ కిక్ ఇచ్చాడు అనూప్ రూబెన్స్.
సాహిత్యం కూడా చక్కగా కుదిరింది. '''నాయకుడై నడిపించేవాడు... సేవకుడై నడుం వంచే వాడు... అందరికోసం అడుగేశాడు... మిరామిరా మీసం...మెలితిప్పుతాడు జనం కోసం. రెపరెప లాడే జెండాల పొగరున్నోడు. తల వంచక నిన్నంచుల పైనే వుంటాడు. ఇలా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గట్టు సాహిత్యాన్ని అందించడంలో రామజోగయ్య శాస్త్రి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మొత్తంమీద కాటమరాయుడి టైటిల్ సాంగ్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుందిప్పుడు.
శరత్ మారార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్. మార్చి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 18న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



