చివరకు వెంకటేష్ కూడా ఆ లిస్ట్‌లో ఎక్కేశాడా..?
on Mar 4, 2017

ఒకప్పుడు హీరోలంటే..సెట్‌కి వచ్చామా నాలుగు సీన్లు చేశామా..ఇంటికి వెళ్లామా అన్నట్లు ఉండేది..కాని ఇప్పుడు కాలం మారింది.. ప్రస్తుతం హీరోలు నటనతో పాటు తమలోని కొత్త టాలెంట్‌ని చూపిస్తున్నారు.. అదేంటంటే ఒకప్పుడు సింగర్స్ మాత్రమే పాటలు పాడేవారు..ఇప్పుడు హీరోలంతా తమ గొంతును సవరించుకుని పాటలు కూడా పాడేస్తున్నారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు హీరో ధనుష్ కొలవెరీతో పాపులర్ అయిన ఈ ట్రెండ్ ఇప్పుడు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పాకిపోయింది. పవన్, మహేశ్, ఎన్టీఆర్, నితిన్, సిద్దార్ధ్, మనోజ్, పాట పడి అందరినీ ఆకట్టుకున్నారు.
అగ్రకథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులతోనే కాకుండా పాట కూడా పాడగలనని నిరూపించారు. మృగరాజు మూవీలో "చాయ్ చటుక్కున తాగరా" అనే పాట పాడారు. తాజాగా మరో అగ్రకథానాయకుడు వెంకటేశ్ కూడా సింగర్‌గా మారారు. ఆయన తాజాగా నటిస్తున్న గురు సినిమా కోసం పాట పాడారు. కెరీర్‌లో మొదటిసారిగా వెంకీ ఇలా చేస్తున్నారు. ఈ మూవీలో వెంకీ బాక్సింగ్ కోచ్‌గా నటిస్తున్నారు. ఆ పాట విని అందరూ వెంకటేశ్‌ని మెచ్చుకున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా..కొంగర సుధ దర్శకత్వం వహిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



