Home

»

Latest News

మేకప్ లేకుండా త్రిప్తి డిమ్రి ఏం చేసిందంటే.. ఓ మై గాడో  

Aug 1, 2026 3:14PM

 

యానిమల్ మూవీతో 'త్రిప్తి డిమ్రి'(Tripti dimri)సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన సుందరీమణికి కూడా ఆ స్థాయి క్రేజ్ రాలేదనే చెప్పుకోవడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రెజెంట్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)సందీప్ రెడ్డి వంగతో  స్పిరిట్ లో  జత కడుతు ఏ రోజు కా రోజు  టాక్ ఆఫ్ ది డే హోదాలో ఉంటుంది

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ చిన్న పిక్ పోస్ట్ చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇటీవలే ముంబై వీధుల్లో అత్యంత సాధారణమైన దుస్తుల్లో, ఎలాంటి ఆడంబరాలు లేకుండా కెమెరా కంటికి చిక్కిన త్రిప్తి డిమ్రికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌ షేక్ చేస్తున్నాయి. సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో వెలిగే కథానాయికలు బయటకు వస్తే భారీ మేకప్, హై ఎండ్ డిజైనర్ డ్రెస్సులతో హంగామా చేయడం చూస్తూంటాం. కానీ త్రిప్తి  డిమ్రి మాత్రం దానికి పూర్తి భిన్నంగా చాలా సింపుల్‌గా దర్శనమిచ్చింది. ఒక సాదాసీదా వైట్ షర్ట్, దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ ప్యాంట్ ధరించి నేచురల్ లుక్‌తోనే ఆమె ప్రదర్శించిన నవ్వు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి హంగులు లేకపోయినా ఆమెలో ఉన్న ఆకర్షణ, సహజమైన గ్లామర్ కాస్త కూడా తగ్గలేదని ఈ దృశ్యాలు నిరూపిస్తున్నాయి.


Also read: ఓటిటిలో ల్యాండ్ అయిన తెలుగు రొమాంటిక్ కామెడీ సిరీస్.. నరకడాలు లేవ్

పాపరాజీలు ఆమెను చూసి కెమెరాలలో బంధించేందుకు పోటీ పడగా, త్రిప్తి కూడా అంతే ఎంతో వినయంతో, చిరునవ్వుతో కెమెరాలకు ఫోజులిచ్చింది. తన కారు ఎక్కే ముందు మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలకరించడం, ఎటువంటి గర్వం లేకుండా చాలా క్యాజువల్‌గా మెలిగిన తీరు నెటిజన్ల మనసులని దోచుకుంటుంది.  ఎంటైర్ ఈ సంఘటనతో తేలిన నిజం ఏంటంటే నిజమైన అందానికి మేకప్ అవసరం లేదు, ఆత్మవిశ్వాసమే అసలైన గ్లామర్ అనే నిజం మరోసారి రుజువయ్యింది.

Tripti dimri, Prabhas, Spirit

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com