Home

»

Latest News

నా డ్రీం హీరో అతనే.. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ వ్యాఖ్యలు వైరల్ 

Aug 1, 2026 4:10PM

 

సినిమా అనే ప్రేమతో కూడిన బలమైన ఆయుధంతో పోటీ చేసిన మొదటి సారే ఇళయ దళపతి విజయ్(Vijay)ముఖ్యమంత్రి పీఠాన్ని పొందాడాంటే విజయ్ స్టార్ సునామీని అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం జన నాయగన్(జన నాయకుడు) గా సెల్యులాయిడ్ పై ఉన్నాడు.  ఇక విజయ్ వారసుడు జాసన్ సంజయ్(Jasan Sanjay)దర్శకుడిగా మారి  'సిగ్మా' అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. సందీప్ కిషన్ హీరో.


 ఇటీవల ఓ ప్రముఖ డిజిటల్ మీడియాకు ఇచ్చిన ప్రత్యక్ష ఇంటర్వ్యూలో సంజయ్ కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. హాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ జాసన్ స్టాథమ్ మీ 'సిగ్మా' సినిమా చూసి, మీకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశం ఇస్తే, ఏ భారతీయ నటుడిని ఆయనతో కలిసి నటించడానికి ఎంచుకుంటారు అని ప్రశ్నించగా, సంజయ్ క్షణం కూడా ఆలోచించకుండా "ఖచ్చితంగా మా నాన్న విజయ్ నే ఎంచుకుంటాను". విజయ్, జాసన్ స్టాథమ్ ల కాంబినేషన్ హాలీవుడ్ తెరపై అత్యంత పవర్ ఫుల్ కాంబినేషన్ అవుతుందని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా  గతంలో విజయ్ నటించిన 'గిల్లి' చిత్రంలోని ఆయిల్ ఫైట్ సీన్, జాసన్ స్టాథమ్ నటించిన 2002 నాటి హాలీవుడ్ క్లాసిక్ 'ది ట్రాన్స్‌పోర్టర్' ఫైట్ సీన్ల మధ్య ఉన్న పోలికలని  ప్రేక్షకులు గుర్తుచేసుకుంటున్నారు.

Also read: షారుక్ ఖాన్ కింగ్ మూవీ సంచలనం.. ఆ రైట్స్ ని 50 కోట్లకి అడుగుతున్న సంస్థ 


వాస్తవానికి జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన 'సిగ్మా' చిత్రం 2026 జులై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే విజయ్ చివరి చిత్రంగా ప్రచారంలో ఉన్న 'జన నాయగన్' విడుదలకు సంబంధించిన పరిస్థితుల కారణంగా, 'సిగ్మా' విడుదల తేదీని తాత్కాలికంగా వాయిదా వేశారు. త్వరలోనే ఆగస్టు నెలలో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, స్వీయ ప్రతిభతో, విదేశాల్లో సినిమా నిర్మాణ మెళకువలు నేర్చుకుని రంగంలోకి దిగిన జాసన్ సంజయ్, భవిష్యత్తులో హాలీవుడ్ స్థాయిలో తన తండ్రి విజయ్ ని డైరెక్ట్ చేసే కలను నెరవేర్చుకుంటారా లేదా అనేది సినీ ప్రపంచంలో ఆసక్తిగా మారింది. కానీ విజయ్ తన చివరి మూవీ జన నాయగన్ అని చెప్పేసాడు.   

Vijay, jason sanjay, Sigma

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com